ETV Bharat / state

అనంతలో కరోనా అలజడి.. కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు - అనంతపురం జిల్లాలో కరోనా కేసుల వార్తలు

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ ముమ్మరంగా వ్యాప్తి చెందుతోంది. మొన్నటివరకూ కేసుల సంఖ్య అధికంగా ఉండగా.. ప్రస్తుతం మరణాలూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ బారిన పడిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు మృత్యువాత పడుతున్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టలేమని గుర్తించిన అధికారులు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టిసారించారు. అయినప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ananthapuram district corona cases and deaths
అనంతపురం జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : Jul 15, 2020, 9:09 AM IST

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగటంతోపాటు మరణాలు అధికమవుతున్నాయి. మంగళవారం కొత్తగా 185 మందికి వైరస్ సోకగా, 10 మంది మృతిచెందారు. జిల్లాలో ఇప్పటివరకు 3,651 మందికి కొవిడ్ సోకింది. మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల్లోనే 16 మంది చనిపోవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. రాబోయే 2 నెలల్లో వైరస్ మరింత విజృంభిస్తుందని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న పరీక్షలు-అధికమవుతున్న కేసులు

జిల్లావ్యాప్తంగా 6 ప్రయోగశాలల ద్వారా రోజూ 2 వేల నమూనాలు పరీక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 1200 నమూనాలు పరీక్షిస్తుండగా.. ట్రానాట్ ప్రయోగశాలల్లో 800 పరీక్షలు చేస్తున్నారు. కొవిడ్ పరీక్షలు పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. 5 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెొప్తున్నా.. క్షేత్రస్థాయిలో వెయ్యి పడకలు కూడా సమకూర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. వైరస్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి

అనంతపురం పట్టణంతోపాటు గ్రామీణప్రాంతాల్లోనూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. మద్యం దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవటం వల్ల కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజల్లో స్వీయ జాగ్రత్తలు పాటించేలా అవగాహన వస్తే తప్ప వైరస్ విజృంభణ ఆగదని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..

కడప జిల్లాలో 'ఆపరేషన్ ముస్కాన్' ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.