దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన రాజకీయ పార్టీలు ప్రేరేపించిందని అనంతపురం జిల్లా భాజపా అధ్యక్షులు శ్రీనివాసులు ఆరోపించారు. భాజపా ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి మేలు చేసేలా అనేక సంస్కరణలు చేసిందని తెలిపారు. ఆ విషయం గుర్తించని రైతులు.. రాజకీయ పార్టీల ఉచ్చులోకి వెళుతున్నారన్నారు.
రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసిందని.. దీన్ని కొంతమంది తప్పు పడుతున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నాయంటూ మండిపడ్డారు.
ఇవీ చదవండి..