"కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే... మీరు రోడ్లపై చక్కర్లు కొట్టడం ఏంటి?" అంటూ అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ ప్రజలను ప్రశ్నించారు. ధర్మవరంలో లాక్ డౌన్లో భాగంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు చేసినా... పెడచెవిన పెట్టి రోడ్లపైకి రావటంపై ఆగ్రహించారు. జిల్లాలోని పొట్టిశ్రీరాములు కూడలి వద్ద వాహన చోదకులను ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: