సచివాలయానికి వచ్చే అర్జీలకు ఏ రోజుకారోజు పరిష్కారం చూపించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామ సచివాలయం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్నింటికి పరిష్కారం చూపించారు అనే వివరాలపై ఆరా తీశారు.
ప్రభుత్వ పథకాల పోస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చాలన్నారు. ఉద్యోగులు తమ హాజరును తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారం అందచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు