లాక్డౌన్ అమలుతో రోజువారీ కూలీలు, చేతి వృత్తులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కదిరి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా...కేవలం రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీతో ఆలోచనలు పంచుకున్నా: చంద్రబాబు