అనంతపురం,కాకినాడ జేఎన్టీయూ, శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్శటీ వీసీల నియామకాల్ని సవాలు చేస్తూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మలిరెడ్డి వెంకటరాయ ఫణీంద్ర , కడప జిల్లాకు చెందిన డి. నాగార్జునరెడ్డి గతేడాది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసీల ఎంపిక విధానంపై నిబంధనలను పాటించలేదన్న కారణంపై వ్యాజ్యాలు ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. సర్వీసు సంబంధ అంశాలపై దాఖలైన పిల్స్కు విచారణర్హత ఉండదని తెలిపింది. ఈ అభ్యంతరాలపై సంతృప్తికర వాదనలు చెప్పేందుకు సిద్ధపడి రావాలని పిటిషనర్ల తరపు న్యాయవాదికి స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ . జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఇవీ చదవండి