కరోనా వచ్చిందని తెలిస్తే చాలు ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితులున్న ఈ రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఓ ఆటో డ్రైవర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఉరవకొండ మండలం కోనాపురంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో 13 మంది వైరస్ బారిన పడ్డారు. వారిని తరలించడానికి వైద్యాధికారి రంజిత్ కుమార్ అత్యవసర వాహనానికి సమాచారం ఇస్తుండగా అదే గ్రామానికి చెందిన టాటా ఏస్ వాహనం డ్రైవర్ జగదీష్ వారిని ఉచితంగా తన వాహనంలో తరలించడానికి ముందుకు వచ్చాడు. వారందరినీ అనంతపురంలోని కొవిడ్ కేర్ కేంద్రానికి చేర్చారు.
ఇదీ చూడండి