రాష్ట్రంలో నిరుపేదల, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... అనంతపురం జిల్లా రొద్దంలో తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని కోరారు. రైతులు పండించిన ధాన్యం, మిర్చి, పత్తి, పండ్లు తదితర ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.