కోవిడ్ కేసుల నిర్వహణలో విధానం మార్చుకునేలా ప్రభుత్వం ఆదేశించినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. తాజాగా వచ్చిన ఆదేశాలతో ఇతర వ్యాధులతో బాధపడేవారితోపాటు వృద్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా బాధితుల కోసం జిల్లా వ్యాప్తంగా వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చేసిన మార్పుల మేరకు ఒక్కో రోగికి ఓ గది ఉండేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గ్రీన్ జోన్లలో నివాసం ఉండే వారు, ఆయా జోన్ల మధ్య ఎక్కడికైనా వెళ్లవచ్చని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి