ETV Bharat / state

అనంత ఎస్పీకి ప్రతిష్టాత్మక ' స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ' అవార్డు - ఎస్పీ యేసుబాబుకు ప్రతిష్ఠాత్మక ' స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ' అవార్డు

ప్రతిష్టాత్మక ' స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ' అవార్డుకు అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఎంపికయ్యారు. లాక్​డౌన్ సమయంలో కరోనా విస్తరించకుండా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించటం కోసం రూపొందిన సువిధ అప్లికేషన్​కు ఈ అవార్డు దక్కింది.

స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్  అవార్డు
స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు
author img

By

Published : Nov 30, 2020, 10:37 PM IST

స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్  అవార్డు
స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు

అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబుకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ' స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ' అవార్డు దక్కింది. లాక్​డౌన్ సమయంలో కరోనా వేగంగా విస్తరించకుండా దోహదం చేసిన సువిధ అప్లికేషన్​కు ఈ అవార్డు దక్కింది. దిల్లీకి చెందిన స్కోచ్ గ్రూపు వారు ఈ అవార్డును ఎస్పీకు ఇవాళ ఆన్​లైన్​లో అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తుండటాన్ని దేశవ్యాప్తంగా గుర్తించి ప్రతీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో కరోనా విస్తరించకుండా ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు, మందులు (మెడిసిన్స్) పంపేందుకు జిల్లా ఎస్పీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సువిధ అప్లికేషన్​ను రూపొందించి అమలు చేశారు. నిత్యావసర దుకాణాలు, మందుల దుకాణాల యజమానులను ఈ యాప్​లో పొందుపరిచి ప్రజల ఇళ్ల వద్దకే అన్నిరకాల సరుకులు డోర్ డెలివరీ చేశారు. యాప్ రూపొందించడంలో సహకరించిన జిల్లా పోలీసు టెక్నికల్ విభాగం సీఐ హమీద్ ఖాన్ , ఎస్సై క్రాంతికుమార్ , ఆర్ ఎస్సై సురేష్ రెడ్డి, యాప్ డెవలపర్ మణికంఠలను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇదీచదవండి

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. శ్రీనిత్య కుటుంబానికి ఆర్థికసహాయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.