అనంతపురం శివారు నందమూరి నగర్ సమీపంలోని మండల సుబ్బారెడ్డి కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ కిష్టప్ప.. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లి.. ఆటోలోనే మృతి చెందాడు. తన భార్య అన్న మరొక ఊరిలో విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మొత్తం అతని అంత్యక్రియల కోసం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కిష్టప్ప తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు.
గమనించిన స్థానికులు అతడిని ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో స్థానికులు ఆవేదన చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న కిష్టప్ప మరణించటంతో భార్య, పిల్లలు ఒంటరి అవుతారని ఆందోళన చెందారు. అన్న మరణం జీర్ణించుకునే లోపే తన భర్త మరణించిన విషయం తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: