Ambulance Repaired on Road: అనంతపురం జిల్లా ఉరవకొండలో 108 వాహనం రహదారిపై మరమ్మతులకు గురైంది. విడపనకల్లు ఆసుపత్రికి చెందిన ఆ వాహనం ఉరవకొండలో ప్రాణపాయ స్థితిలో ఉన్న డయాలసిస్ రోగిని అత్యవసరంగా చికిత్సకు తీసుకురావడానికి వెళుతుండగా.. రహదారిపైనే నిలిచిపోయింది. తరచూ ఆ వాహనం ఇలాగే మరమ్మతులకు గురువుతున్నట్లు సమాచారం. వాహనం స్టార్ట్ అవాలంటే.. ప్రతిసారీ తోయాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సమయాలలో.. రోగులను తరలిస్తున్న సందర్భాలలో.. వాహనం అగిపోవడంతో రోగులు అత్యవసర వైద్యం పొందడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇలాగైతే అత్యవసర వైద్యం అందేది ఎలా అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: