ETV Bharat / state

అమరావతి కోసం.. కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ.. - అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి నిరసన వార్తలు

అనంతపురం జిల్లా కదిరిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ప్రదర్శన చేపట్టారు. 45 రోజులుగా అమరావతి కోసం రైతులు చేస్తోన్న పోరాటం ప్రభుత్వం కళ్లకు కనిపించకపోవడం దారుణమని.. కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

amaravathi parirakshana samithi rally
కదిరిలో ళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ
author img

By

Published : Feb 2, 2020, 1:49 PM IST

రాజధాని కోసం కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు నిరసన చేపట్టారు. అమరావతి కోసం 45 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సర్కారు తీరును వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్​ కూడలిలో రాస్తారోకో చేపట్టిన సమితి సభ్యులు ప్రభుత్వ శైలిని తప్పుబట్టారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి అమరావతినే రాజధానిగా కొనసాగించేలా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

రాజధానిగా అమరావతిని కొనసాగించడమే భాజాపా నినాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.