ETV Bharat / state

Allu Arjun Fans: బెనిఫిట్ షో ప్రదర్శించాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్​ ఆందోళన.. - అనంతపురంలో హీరో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన

Allu Arjun fans concern at Anantapur: 'పుష్ప' చిత్రం విడుదల సందర్భంగా బెనిఫిట్ షో ప్రదర్శించాలని అనంతరంపురం జిల్లాలో థియేటర్ వద్ద అర్ధరాత్రి బన్నీ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అభిమానులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అనంతపురంలోని బాలాజీ థియేటర్​పై రాళ్లు రువ్వగా పోలీసులు చెదరగొట్టారు. హిందూపురంలోని బాలాజీ సర్కిల్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు రోడ్డుపై బైఠాయించారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్​ ఆందోళన
Allu Arjun fans concern at hindupuram
author img

By

Published : Dec 17, 2021, 8:10 AM IST

Updated : Dec 17, 2021, 3:43 PM IST

అనంతపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్​ ఆందోళన

Allu Arjun fans concern at anantapur: అనంతపురంలో హీరో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చేపట్టారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం బెనిఫిట్స్ షో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బెనిఫిట్ షో ప్రదర్శించడానికి వీలులేదని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున థియేటర్ యాజమాన్యంతో వాదనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు, అభిమానుల మధ్య తోపులాట జరిగినట్లు థియేటర్ యాజమాన్యం చెప్పారు. దీంతో థియేటర్​పై రాళ్లు రువ్వడంతో థియేటర్ అద్దాలు పగిలాయి. చెదరగొట్టిన పోలీసులు.. 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

protest for pushpa benefit show at Anantapur: అభిమానులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శిస్తామని.. బెనిఫిట్స్ షో ఉండవని తెలిపారు. పోలీస్​ ఉన్నతాధికారులు, తహసీల్దార్ మోహన్ కుమార్.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బెనిఫిట్స్ షో ప్రదర్శన లేదని తెల్చిచెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మోహన్ కుమార్ హెచ్చరించారు.

హిందూపురంలో బన్నీ ఫ్యాన్స్​ ఆగ్రహం
Allu Arjun fans concern at anantapur: నిబంధనల మేరకు బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి లేదని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో హిందూపురంలో బన్నీ ఫ్యాన్స్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని బాలాజీ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాతం ఏర్పడింది. పోలీసుల రాకతో వివాదం సద్దుమణిగింది.

యానాంలో వేలసంఖ్యలో అభిమానులు..
Bunny fans at yanam: పుష్ప చిత్రం బెనిఫిట్ షో ప్రదర్శనను తిలకించేందుకు యానాంలో ధియేటర్ వద్దకు బన్నీ అభిమానులు వేలసంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి..

అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎందుకంత స్పెషల్?

Last Updated : Dec 17, 2021, 3:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.