అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయశాఖ మార్కెట్ యార్డ్ కార్యదర్శి అక్బర్ బాషా.. కార్యాలయంలోనే మద్యం తాగుతున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విధి నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో మార్కెట్ కమిటీ.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు ఆధారంగా కార్యదర్శి అక్బర్ బాషాను విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో హిందూపురం కార్యదర్శి నారాయణ మూర్తికి బాధ్యతలు అప్పగించారు.
ఇదీచదవండి.