మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంత వాసులు మృతి చెందారు. అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలానికి చెందిన విశ్వేశ్వరయ్య లారీ డ్రైవర్‌గా...అంజిత్ క్లీనర్‌గా జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల కిందట అనంత నుంచి సరుకుతో మధ్యప్రదేశ్‌కి బయలుదేరారు.
కాగా జబల్ పూర్ సమీపంలో జీపు, ట్రక్కు, రెండు లారీలు ఒకదానినొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనంతవాసులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను మధ్యప్రదేశ్ నుండి ఏపీకి పంపేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు.