అనంతపురం జిల్లా పెనుకొండలోని పీ.ఆర్.ఆర్. డబ్ల్యూ.ఎస్. కార్యాలయంలో బుధవారం అనిశా అధికారులు దాడులు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న దాసన్న అనే వ్యక్తి నుంచి అనధికారికంగా ఉన్న 13 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అనిశా డీఎస్పీ వెల్లడించారు.
గత ఏడాది అమరాపురం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మోహన్ కుమార్ మంచినీటి పథకం కింద దాదాపు 8 లక్షల రూపాయల పనులు చేశాడు. ఏడాదైనా బిల్లులు చేయకపోగా 18 వేల రూపాయలు సీనియర్ అసిస్టెంట్ దాసన్న.. మోహన్ అనే వ్యక్తి నుంచి నగదు డిమాండ్ చేశారు. అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టంలేక అనిశాను ఆశ్రయించారు. బుధవారం 13 వేల రూపాయలను మోహన్ కుమార్.. సీనియర్ అసిస్టెంట్ దాసన్నకు ఇవ్వగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ అల్లాబకాష్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: