విద్యుత్ కనెక్షన్ కోసం.. రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఓ లైన్ మెన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తోటకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వటానికి నెల క్రితం విద్యుత్ లైన్మెన్ రంగరాజు రూ.30,000 లంచం అడిగాడు. దీంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు గుత్తిలోని టీ కేఫ్‌లో విద్యుత్ లైన్ మెన్‌కు రూ.12,500 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. visakha steel plant: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో పునరాలోచన లేదు: కేంద్రం