ETV Bharat / state

హత్య కేసులు చాకచక్యంగా ఛేదించిన పోలీసులు.. వరించిన ఏబీసీడీ అవార్డులు

author img

By

Published : Aug 9, 2020, 1:25 AM IST

అనంతపురం జిల్లా పోలీసు శాఖకు అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డులు దక్కాయి. కేసుల దర్యాప్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులను ఈ నెల 12న డీజీపీ చేతుల మీదుగా జిల్లా పోలీసు అధికారులు అందుకోనున్నారు.

abcd awards got to ananthpur district police
జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు

కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అందించే ఏబీసీడీ అవార్డులు అనంతపురం జిల్లా పోలీసులను వరించాయి. తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలోని శివాలయంలో ముగ్గురి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న కదిరి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ కేసుకు ఏబీసీడీ అవార్డు దక్కింది.

అలాగే బుక్కపట్నం మండలం, సిద్ధరాంపురంలో గతేడాది గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు శవాన్ని గుర్తుపట్టలేని విధంగా కాల్చారు. ఈ కేసును కూడా పోలీసులు ఛేదించి నిందితులను కటాకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సైతం అవార్డు దక్కింది. జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు రావడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.