ETV Bharat / state

SUICIDE: ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై.. యువకుడు ఆత్మహత్య - suicide in dharmavaram news

భవిష్యత్తు గురించి ఆ యువకుడు ఎన్ని కలలు కని ఉంటాడో... ఉన్నత విద్య పూర్తి చేసిన అతను.. జీవితంలో స్థిరపడేందుకు ఎన్ని ప్రణాళికలు చేసి ఉంటాడో... కుమారుడు ప్రయోజకుడు అయితే చూడాలని తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారో... ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదని ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు ఆ యువకుడు. తాను బాగుపడి, తల్లిదండ్రుల బాగోగులు చూస్తాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించటంతో కన్నవారికి కడుపు శోకమే మిగిలింది.

a young man committed suicide
యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Jun 23, 2021, 8:58 PM IST

ఉద్యోగం రాలేదని కలత చెంది.. భాస్కర్ (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో విషపు గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గమనించిన స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక...

చెన్నే కొత్తపల్లి మండలం నామాల గ్రామానికి చెందిన భాస్కర్ ఎంసీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగాన్వేషణ కోసం మూడు నెలలుగా బెంగుళూరులో ఉన్నాడు. అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దీంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్న అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మరణించటంతో అతని తల్లిదండ్రులు అంజనమ్మ, నారాయణల రోదనలు మిన్నంటాయి. ఉద్యోగం దొరక్కపోవటంతోనే భాస్కర్​ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: మైలవరంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.