అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బిజెపి కొట్టాలలో నితీష్యాదవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించారని విషం తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నూలు జిల్లా మద్దికెర మండలవాసిగా పోలీసులు గుర్తించారు. నితీష్యాదవ్ కుటుంబం అనంతపురంలోని మున్నానగర్లో నివాసమున్నట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: