ETV Bharat / state

ఉపాధి కూలీగా.. పీజీ విద్యార్థిని!

ఇప్పటికే ఉన్న నిరుద్యోగ సమస్యకు కరోనా వ్యాప్తి తోడవుతోంది. ఉపాధి అవకాశాలు లేక.. చదుకున్నవాళ్లూ.. కఠిన పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోంది. చాలా సంస్థల్లో ఉన్న ఉద్యోగులను సైతం తొలగించేస్తున్నారు. కళాశాల చదువులు ముగిసిన వారు ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. ఇటీవల పీజీ పూర్తి చేసిన ఓ యువతి.. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి హామీ పథకం కింద కల్పించే పనులకు వెళ్తోంది.

a post graduate student as daily wage labour
ఉపాధి కూలీగా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని
author img

By

Published : Apr 1, 2021, 2:51 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి చెందిన శ్రావణి... ఇటీవలే ఎమ్మెస్సీ కంప్యూటర్​ సైన్స్​ పూర్తి చేసింది. కరోనా కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ కోసం ఆమె తల్లిదండ్రులిద్దరూ.. ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. వారికి ఆసరాగా నిలిచేందుకు తానూ.. ఉపాధి పనులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు శ్రావణి తెలిపింది. ఈ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొంది.

ఇదీ చదవండి:

ఏనుగుల దాడి... వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.