ఆస్తి విషయంపై చెలరేగిన వివాదంలో అన్ననే చంపాడు ఓ తమ్ముడు. ఉరవకొండ సర్కిల్ పరిధిలోని విడపనకల్ మండలం గాజుల మల్లాపురంలో చెన్నప్ప అనే వ్యక్తిని హత్య చేసినందుకు నిందితుడు చంద్రశేఖర్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి తగాదా విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. అడ్డు వచ్చిన వారిపై అతని కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ...జూరాల ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల