గుత్తిలో వృద్ధురాలి హత్య - గుత్తిలో వృద్ధురాలు హత్య
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. దుండగులు ఆమెను హత్య చేసి... ఇంట్లోని బంగారం దోచుకెళ్లారు. రామాలాయం వీధిలో నారాయణమ్మ అనే వృద్దురాలి భర్త చనిపోయాడు. తన బావమరిది ఆమెను చూసుకుంటున్నాడు. అతను పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. ఇంట్లో వద్ధురాలు మాత్రమే ఉందని గమనించిన దుండగులు... ఆమెపై దాడి చేసి హత్య చేశారు. బంగారు నగలతో పాటు నగదు దోచుకెళ్లారు. గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.