ETV Bharat / state

ధర్మవరంలో ట్రాక్టర్​ ఢీకొని వ్యక్తి మృతి

ట్రాక్టర్​ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన వావానాన్ని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

A man was killed in a road accident
A man was killed in a road accident
author img

By

Published : Apr 16, 2020, 3:00 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం వద్ద ట్రాక్టర్ ఢీకొని లేపాక్షి నాయుడు(55) అనే వ్యక్తి మృతి చెందాడు. గుట్టకిందపల్లి కాలనీకి చెందిన ఆయన కాలినడకన ప్రధాన రహదారిపై వెళుతుండగా వంటచెరుకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లేపాక్షి నాయుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్​లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వారు... హైదరాబాద్​ నుంచి ధర్మవరం వచ్చేందుకు అధికారుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్​ను పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి

సెల్​ఫోన్​ గొడవ.. నిండు ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.