అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి గ్రామ బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పాదచారుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే..
మడకశిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్ల గుణేహల్లి గ్రామానికి చెందిన కడ్లప అనే వ్యక్తి రోడ్డుకు ఎడమ వైపు నుంచి నడుచుకొని వెళుతుండగా అతన్ని ఢీకొంది. కడ్లప్ప తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి
దారుణం: గోపాలపట్నంలో మగ శిశువును విక్రయించిన తల్లి