ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక.. నేత కార్మికుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

suicide
ఆత్మహత్య
author img

By

Published : May 16, 2021, 2:32 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నీరు గంటి వెంకట రాముడు అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ఉరితాడుకు వేలాడుతున్న వెంకట్రాముడు మృతదేహాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేశారు.

సొంత మగ్గం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అతడికి 5 లక్షల రూపాయల వరకు అప్పులు ఉందని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, కుమార్తెలు అంజలి, ఈశ్వరమ్మ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

రష్యా నుంచి హైదరాబాద్​కు చేరుకున్న స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.