ETV Bharat / state

త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - 159.20 కోట్ల నిధులు మంజూరు - CROP DAMAGE COMPENSATION IN AP

పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం - రూ.159.2 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి అచ్చెన్నాయుడు - త్వరలో రైతుల ఖాతాల్లో జమ

Agriculture Minister Atchannaidu On Crop Damage in Assembly
Agriculture Minister Atchannaidu On Crop Damage in Assembly (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 5:07 PM IST

Updated : Nov 15, 2024, 5:17 PM IST

Agriculture Minister Atchannaidu On Crop Damage in Assembly : రైతులకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీపికబురు చెప్పారు. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. 5 జిల్లాల్లోని 54 మండలాలను కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 1.06 లక్షల హెక్టార్లలో పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు ఇప్పటి వరకు తేలిందన్నారు. దీనికోసం రూ.159.20 కోట్లు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు.

నష్టపోయిన రైతులందరికీ పరిహారం : ఈ నెల 28 తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరవు పీడిత మండలాల అంశంపై శాసన మండలి సభ్యుల ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఇప్పటికే రూ.33.3 కోట్ల ఖర్చుతో 1.92 లక్షల రైతులకు 47 వేల క్వింటాళ్ల విత్తానాలు 80 శాతం సబ్సిడీతో అందించినట్లు మంత్రి వెల్లడించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరదలో రైతులు నష్టపోగా 20 రోజుల్లోనే రూ.320 కోట్లు ను నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 80 శాతం కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారం ఇచ్చిందన్నారు. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ సిస్టం సహా సాంకేతికతతో వర్షపాతం వివరాలను నమోదు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు

రూ.5 పని కూడా చేయలేదు : నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరవు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని నిమ్మల రామానాయుడు అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రెండు దశల్లో రూ.17,050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి రూ.5 పని కూడా చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం : ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ప్రాధాన్యత పోలవరం, రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అని స్పష్టంచేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

'మాట్లాడుకోవడం అనవసరం' - శాసనమండలిలో లోకేశ్ Vs బొత్స

'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'

Last Updated : Nov 15, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.