అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మంత్రిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. మండలంలోని అన్ని పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అనేక నమూనాలను ఇక్కడ ప్రదర్శించారు.
ఇదీ చదవండి: