ETV Bharat / state

మిరప పంటకు వైరస్.. రూ.7లక్షలు లాస్..​

author img

By

Published : Jan 14, 2021, 10:54 AM IST

ఓ రైతు భారీగా పెట్టుబడి పెట్టి పది ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. చేతికందే దశలో మిర్చిపంటకు వైరస్​ సోకటంతో...పంటను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. చేసేది లేక ఆ పంటను తీసివేశాడు. పండించిన పంట బూడిదలో పోసిన పన్నీరు కావటంతో... తీవ్ర ఆవేదన చెందాడు.

A farmer removes the yielding chilli crop in ananthapuram
మిర్చి రైతు ఆవేదన

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చిన్నకు చెందిన వెంకటేశులు అనే రైతు ఎన్నో ఆశలతో పది ఎకరాల విస్తీర్ణంలో బ్యాడిగ మిరప పంట సాగు చేశాడు. సెప్టెంబర్ మాసంలోనే కర్ణాటక నుంచి మిరప నారు కొనుగోలు చేసి సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.7 లక్షలకు పైగా వెచ్చించాడు. వైరస్ సోకటంతో పంట మొత్తం బుధవారం ఉదయం ట్రాక్టర్లతో దున్ని చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టించి, వెచ్చించిన పెట్టుబడి మొత్తం బుడిదలో పోసిన పన్నీరు అయింది. పంట మొత్తం నష్టపోవడంతో రైతు వెంకటేశులు పొలంలో రోటవేటర్ వేసి పూర్తిగా పంటను తొలగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

సూర్యలంక నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మత్తి చేప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.