ETV Bharat / state

మొండెం నుంచి తల వేరు చేసి... చేతిని నరికి హత్య - తిమ్మాపురం వద్ద తల లేని మృతదేహం వార్తలు

గుంతకల్లులో తల లేని మృతదేహం కలకలం రేపింది. అత్యంత కిరాతకంగా తలను, మొండెంను వేరు చేసి కుడి చేతిని నరికివేసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహం
author img

By

Published : Nov 12, 2019, 7:20 AM IST

తల లేని మృతదేహం కలకలం

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివార్లలోని తిమ్మాపురం గ్రామం వద్ద గుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్​లో ఓ తల లేని మృతదేహం ఉన్నట్టు గ్రామస్థులు గ్రామ రెవెన్యూ అధికారికి సమాచారం అందించారు. స్థానిక గ్రామ రెవెన్యూ సహాయకుడు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆప్రాంతానికి చేరుకొని మృత దేహాన్ని వెలికితీశారు. అయితే ఆ మృతదేహానికి తల, కుడి చెయ్యి లేకుండా ఉండటంతో ఆనవాళ్ల గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. హత్య జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల, ఇతర శరీర భాగాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఓ బైక్​ను పోలీసులు గుర్తించారు. అయితే ఈ ద్విచక్ర వాహనం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిదని తెలిసింది. అతను ఇప్పటికే తన వాహనం చోరీకి గురైనట్లు సమాచారం ఇచ్చారని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతుడు ధరించిన దుస్తులు బట్టి అతను కర్నూలు జిల్లా నివాసి అని పోలీసులు భావిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లభించకుండా హంతకులు జాగ్రత్తపడ్డారని పోలీసులు అంటున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి

రాజధాని అంశాన్ని కమిటీ నిర్ణయిస్తుంది: బొత్స

'తెదేపాలో తెలుగు ఉందని ఇలా చేస్తున్నారేమో'

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 11-11-2019 Slug:AP_Atp_21_11_head_cut_body_Avb_ap10176 anchor:-అనంతపురం జిల్లా,గుంతకల్లులో తల లేని మొండెం శవం కలకలం రేపింది.అత్యంత కిరాతకంగా తలను మొండెంను వేరు చేసి కుడి చేతిని నరికివేసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.గుంతకల్లు పట్టణ శివార్లలోని గుంతకల్లు సబ్ బ్రాంచ్ కెనాల్ లో తిమ్మాపురం గ్రామ సమీపంలో ఓ తల లేని మొండెం ఉన్నట్టు గ్రామస్థులు గ్రామ రెవెన్యూ అధికారికి సమాచారం అందించారు.స్థానిక గ్రామ రెవిన్యూ సహాయకుడు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హ ఆప్రాంతనికి చేరుకొని మృత దేహాన్ని వెలికితీశారు. ఐతే హా మృత దేహానికి తల,కుడి చెయ్యి లేకుండ ఉండటంతో ఈ మృత దేహం ఎవరిది అని గుర్తు పట్టడం పోలీసులకు కష్టం గా మారింది. ఇప్పటికె దాదాపు నాలుగైదు రోజులు క్రితమే చనిపోయినట్టుగా మృతదేహం స్థితిని బట్టి తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.తల ఇతర శరీర భాగాలు కోసం చుట్టుపక్కల ప్రాంతాలoత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.కొద్దీ దూరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ బైక్ పోలీసులకు ఆచూకీ లభ్యమైంది.ఐతే ఈ ద్విచక్ర వాహనం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిధిగా తెలిసింది.హా వ్యక్తి ఇప్పటికె పోలీసులకు తమ వాహనం ఎత్తుకెళ్లినట్లు సమాచారం ఇచ్చానట్లు పోలీసు వర్గాలు తెలిపారు. మృతుడు ధరించిన దుస్తులు బట్టి అతను కర్నూల్ జిల్లా కు చెందిన నివాసి ఐ ఉంటాడని తెలుస్తుంది.ఐతే గుంతకల్లు రూరల్ పోలీసులుకు మాత్రం చిక్కుముడిగా ఈ హత్య కేసు ఉన్నట్లుగా భావిస్తున్నారు.ఎటువంటి ఆధారాలు లభించకుండా హంతకులు చేసారని,పోలీసులు అంటున్నారు.శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. బైట్1:-రూరల్ సి.ఐ రాము,గుంతకల్లు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.