అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 45 గోవా మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.33,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అతణ్ని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: అనంతలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్టు