ETV Bharat / state

రికార్డుల్లో నమోదు కాని నగదు.. 4లక్షలు స్వాహా..!

4 లక్షలు రూపాయలు దాచుకున్న రైతుకు గుంతకల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధికారి టోపీ పెట్టాడు. ఎఫ్​డీ చేసిన డబ్బును రికార్డుల్లోకి ఎక్కించకుండా పక్కదారి పట్టించాడు. బాధితుడు కలెక్టర్​ను ఆశ్రయించటంతో నగదు చెల్లించేందుకు అధికారులు ఒప్పుకున్నారు.

రికార్డుల్లోకి ఎక్కించకుండా ఎఫ్ డీ నగదు స్వాహా
author img

By

Published : Jul 18, 2019, 12:49 PM IST

రికార్డుల్లోకి ఎక్కించకుండా ఎఫ్ డీ నగదు స్వాహా

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో అవినీతి చోటు చేసుకుంది. సహకార సంఘంలో అక్రమాలు జరిగాయని జిల్లా కో-అపరేటివ్ అధికార బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని కొట్టాలకు చెందిన శ్రీనివాసులు 2016లో ఎఫ్​డీ చేసిన రూ.4 లక్షలు చెల్లించడంలో సొసైటీ అధికారులు జాప్యం చేస్తున్నారని.. బాధిత రైతు కలెక్టర్​ను ఆశ్రయించారు. దాంతో జిల్లా కలెక్టర్ నలుగురు అధికారులతో విచారణ చేపట్టగా.. రికార్డుల్లో నమోదు చేయకుండా ఎఫ్​డీ నగదు స్వాహా చేసినట్లు రుజువైంది. కానీ సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జున తనకేమీ తెలియదని.. అప్పటి సంఘం సీఈఓ లక్ష్మీనారాయణ హయాంలోనే అవినీతి జరిగిందంటున్నారు. సంఘానికి చెడ్డ పేరు రాకుండా రైతుకు 3 నెలల వ్యవధిలోనే ఎఫ్​డీ డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తామని అధికారులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు.

ఇదీ చూడండి:శ్రీవారి దర్శన విధానం మారింది.. తెలుసుకున్నారా?

Intro:తిరుమల కొండపై నాగుపాములు కలకలం రేపాయి. ఆరడుగుల నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ పాపవినాశనం దారిలోని కల్యాణవేదిక ఎదుట ఉన్న ఉద్యాన వనంలో తిస్టవేసింది. పడగవిప్పి ఆడుతూ భయకంపితులను చేసింది. తితిదే సిబ్బంది పాములు పట్టే భాస్కర్‌ నాయుడికి సమాచారం ఇవ్వగా... అక్కడికి చేరుకున్న పాముల భాస్కర్‌ నాయుడు సర్పాన్ని చాకచక్యంగా ఆదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన నాగిణి ఆయన మీడకూ పడగ విప్పింది. పాములను పట్టడంలో నేర్పరి అయిన ఆయన పాములను పట్టే యంత్రాలతో పట్టుకుని తిరుమలకు దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో వడిలిపెట్టారు. స్థానికులు నివసించే ఆర్బిసెంటర్‌లో కూడా నాగుపాము చేరింది. దీనినికూడా భాస్కర్‌ నాయుడు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా పట్టుకున్నాడు. Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.