రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనంతపురంలోని చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద 11 మంది ఆ నదిలో చిక్కుకుపోయారు. వాయుసేన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి: Weather Update: పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం