ETV Bharat / state

పేదరికం కాటేసింది .. చదువుకోసం తనువును వదిలేసింది. - STUDENT SUICIDE FOR HIGHER STUDIES

చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న ఆ విద్యార్థినికి కుటుంబ పరిస్థితులు పైచదువులకు వెళ్లకుండా ఆటంకమయ్యాయి. ఇంట్లో పెద్దలు మాట్లాడుకున్న మాటలు ఆ అమ్మాయిని మానసికంగా చిత్రవద చేశాయి. పైచదువులు చదవాలన్నా తన ఆశ ఇక తీరదేమో అనే బాధతో గ్రామానికి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంటలో జరిగింది.

10Th_Class_Student_Sucide
తనువును వదిలేసింది.
author img

By

Published : Aug 16, 2021, 3:57 PM IST

Updated : Aug 16, 2021, 4:15 PM IST

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పై చదువులకు పంపరేమో అన్న అనుమానంతో ఓ విద్యార్థిని గ్రామానికి సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంటలో చోటుచేసుకుంది. ఎందుకమ్మా.. ఇంతపని చేశావని తల్లిదండ్రులు రోదించడం అందరిని కంటతడి పెట్టించింది.

గాండ్లపెంట మండలం వేపలకుంటకు చెందిన వాసు, హక్కులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజిత ఇటీవలే పదోతరగతి ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్​లో చేరాల్సి ఉంది. పూజిత వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాసు తన సోదరులతో కలిసి జీవిస్తున్నారు. వాసుతో పాటు సోదరుడికి పిల్లలు ఉన్నారు.

వరుసగా కరవు పరిస్థితులు ఎదురవడం, కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేకపోవడం వలన కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువు మానిపించాలన్న చర్చ ఇంట్లో జరగగా ఆ మాటలు విన్న పూజిత మనసులో కుమిలిపోయింది. నాలుగైదు రోజులుగా ఇంట్లో అన్యమనస్కంగానే ఉంది. కుటుంబ సభ్యులు పగలంతా పొలం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి రావడం కారణంగా పూజిత మానసిక పరిస్థితిని అంచనా వేయలేక పోయారు.

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనను ఇంటర్మీడియట్ చదివించలేరని నిర్ణయానికి వచ్చిన పూజిత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూజిత కోసం కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లతో పాటు గ్రామంలోని పరిచయస్థులు, పరిసర గ్రామాల్లోనూ గాలించారు. బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూజిత క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందన్న కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. అదృశ్యమైన పూజిత గ్రామానికి సమీపంలోని గండిచెరువులో విగతజీవిగా తేలియాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో చెరువు వద్దకు చేరుకున్న పూజిత తల్లిదండ్రులు ఎందుకమ్మా ఇంత పని చేశావు అంటూ బోరున విలపించారు.

మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని గాండ్లపెంట ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: గుంటూరు జీజీహెచ్​ దగ్గర ఉద్రిక్తత..నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేతల డిమాండ్​

Last Updated : Aug 16, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.