Kothakota Police Station: ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ను మించిన స్ధలం ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. తాను పని చేస్తున్న స్టేషన్లోనే ఫుల్లుగా మద్యం సేవించి ఓ మహిళతో పట్టుబడిన ఘటన అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పోలీస్ స్టేషన్లో జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఏఎస్సై అప్పారావు పూటుగా మద్యం సేవించి స్టేషన్లో మహిళతో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. కొంతమంది స్టేషన్కు చేరుకుని ఏఎస్సైని పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ సయ్యద్ అలీ వెంటనే స్టేషన్కు చేరుకుని జరిగిన తప్పుపై నిలదీశారు. విషయం బయటకు తెలియడంతో ఇక చేసేదేమీ లేక అప్పారావు.. సీఐ కాళ్ల మీద పడి క్షమించాలని వేడుకున్నాడు.
ఇవ చదవండి: