ETV Bharat / state

Ayyanna on NTR: అధికారంలోకి వచ్చాక.. ఎన్టీఆర్​ జీవిత చరిత్రను పాఠ్యాంశం చేస్తాం: అయ్యన్న - District level celebrations of NTR centenary

TDP Leader Ayyanna Pathrudu Comments on NTR: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని మాజీ మంత్రి చింతకాయ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ శత జయంతి జిల్లా స్థాయి ఉత్సవాలు నిర్వహించారు.

TDP Leader Ayanna Pathrudu Comments on NTR

author img

By

Published : May 26, 2023, 11:26 AM IST

Updated : May 26, 2023, 11:50 AM IST

TDP Leader Ayyanna Pathrudu Comments on NTR: యుగపురుషుడు, శకపురుషుడు సర్గీయ నందమూరి తారక రామారావు గురించి నేటి తరం విద్యార్థులకు తెలిసే విధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ శత జయంతి జిల్లా స్థాయి ఉత్సవాలు నిర్వహించారు.

పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్​ జీవిత చరిత్ర: రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. వచ్చిన వెంటనే పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేరుస్తామని చెప్పారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యే అవకాశం తనకు ఎన్టీఆర్ దయ వల్ల దక్కిందన్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను సైతం అరెస్టు చేసిందని.. అలాంటిది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో.. దీని వెనుక ఎవరు ఉన్నారో దేశ ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి అమిత్​ షా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. అవినాష్‌రెడ్డి అరెస్టు యత్నాలను వైసీపీ రౌడీలతో అడ్డుకోవడం, వారికి పోలీసులు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చెయ్యనియ్యకుండా పోలీసు అధికారులు చేసిన ప్రయత్నంతో రాష్ట్ర పోలీసుల పరువు పోయిందన్నారు. ఇందుకు కారకులైన ఎస్పీ, డీజీపీలను తక్షణం సస్పెండ్‌ చేయాలని అయ్యన్న డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్​ పెట్టిన పార్టీలో మేము ఉండటం చాలా గర్వంగా ఉంది: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న పదానికి మారుపేరే నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 100 సంవత్సరాలు అయినా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపడం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. చిన్న పిల్లాడి కూడా ఎన్టీఆర్​ బొమ్మను చూసే ఆయన గురించి చెప్పగలుగుతారని.. అటువంటి నాయకత్వం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్​ అని స్పష్టం చేశారు. దేశ, విదేశాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు సంవత్సరం పాటు ఎన్టీఆర్​ శత జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం చిన్న విషయం కాదన్నారు. అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీలో తాము కూడా ఉండటం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ద నాగ జగదీశ్వరరావు, ఎమ్మెల్సీ చిరంజీవి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు, మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు భరత్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 26, 2023, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.