ETV Bharat / state

"సమయం లేదు మిత్రమా.. ఎన్నికలకు సిద్ధం కావాలి" - చంద్రబాబుకు అయ్యన్న సూచనలు

Ayyanna Suggestions to Chandrababu : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఐదుగురు దోచుకుంటున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పనిచేయని వారికి టికెట్లు ఇవ్వవద్దని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎటువంటి రాజీలు లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరి సహకారం తీసుకోవడంలో తప్పులేదని తెలిపారు.

Ayyanna Suggestions to Chandrababu
Ayyanna Suggestions to Chandrababu
author img

By

Published : Nov 19, 2022, 6:44 PM IST

Tdp Ayyanna Suggestions To CBN : సమయం లేదు మిత్రమా అనే బాలకృష్ణ డైలాగ్ స్ఫూర్తితో అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని తెలుగుదేశం సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఫలానా నేత పనికిరాడని భావిస్తే టిక్కెట్ల కేటాయింపులో రాజీపడొద్దని చంద్రబాబుని కోరారు. తాను పనిచేయట్లేదని భావిస్తే... తనకు టిక్కెట్టివ్వొద్దన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్లాలన్నారు. ప్రజలు మన పక్షాన ఉన్నప్పుడు టెన్షన్ పడొద్దని అధినేతకు సూచించారు.

చంద్రబాబు కూల్‌గా ఉండి నిర్ణయాలు తీసుకుంటే చాలన్నారు. రావణాసుడిని నేరుగా చంపే సత్తా శ్రీరాముడికి ఉన్నా.. లోక కళ్యాణం కోసం ఉడత నుంచి రావణాసురుడి సోదరుడు సహా అందరి సహకారం తీసుకున్నాడన్నారు. మనమూ అదే ధోరణితో వెళ్లాలని తెలిపారు. 2019 ఎన్నికలు ఓ పీడకల అని.. ఇక దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని క్షేత్రస్థాయిలో ప్రజలు బలంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.