అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో విషాదం నెలకొంది. దుస్తులు ఉతకడానికి ఏలేరు కాలువ వద్దకు అక్కాచెల్లెలు వెళ్లారు. దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి.. పడాల తిరుమల(18), పడాల యమున(12) నీటిలో గల్లంతయ్యారు. వీరిలో అక్క పడాల తిరుమల మృతదేహాన్ని వెలికితీయగా.. చెల్లెలు పడాల యమున కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలను స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: బాలయ్య-చరణ్-విజయ్.. దేనికి జై కొడతారో?
అర్ధరాత్రి రాళ్లు రువ్వుతూ బాలుడి వీరంగం.. 36 కార్లు ధ్వంసం
నరసరావుపేట పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ 'అగ్నిపథ్' అల్లర్ల సూత్రధారి..!