ETV Bharat / state

తప్పు చేశానని నిరూపిస్తే.. ప్రాణం తీసుకుంటా: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Minister Gudivada Amarnath: రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. తాను వ్యాపారాలు చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని,.. రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించి వచ్చానని అన్నారు. తాను నీతి తప్పానని, తప్పు చేశానని నిరూపిస్తే ప్రాణం తీసుకుంటానని వ్యాఖ్యానించారు.

Minister Gudivada Amarnath fires on pawan kalyan
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
author img

By

Published : Apr 25, 2022, 7:18 AM IST

Minister Gudivada Amarnath: తాను వ్యాపారాలు చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించి వచ్చానని.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. తాను నీతి తప్పానని, తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకొని, ప్రాణం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో వాలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా.. మంత్రి అమర్‌నాథ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1978 నుంచి తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదని మంత్రి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ రైతుల గురించి మాట్లాడలేదన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది చేస్తారని, ఎక్కడకు వెళ్లాలంటే అక్కడికి వెళ్తారని.. అదే ఆయన రాజకీయ జీవితమని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు, ఇబ్బందులు పవన్‌కు గుర్తులేవా అని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్‌లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు సైతం మంత్రి చేశారు.

ఇదీ చదవండి:

"బాబు బ్యానర్​లో.. పవన్ హీరోగా దత్తపుత్రుడు సినిమా.. ఫ్లాప్ ఖాయం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.