ETV Bharat / state

పాఠశాలల విలీనం, టీచర్ల హేతుబద్ధీకరణపై విచారణ.. జనవరి 4కు వాయిదా: హైకోర్టు - ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జనవరి 4కు వాయిదా

Merger of Schools, Rationalization of Teachers Adjournment: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు.. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏ తరగతి విద్యార్థులకు ఏ విధమైన అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయాలో ఎన్సీటీఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆ నిబంధనల ప్రకారం.. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్‌జీటీ, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు బీఈడీ అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లతో విద్యా బోధన చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

AP HIGH COURT
పాఠశాలల, టీచర్ల హేతుబద్ధీకరణ వాయిదా
author img

By

Published : Dec 30, 2022, 2:53 PM IST

Merger of Schools, Rationalization of Teachers Adjournment: రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం సర్కారు తీసుకొచ్చిన జీవోలు విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయవాది ఇంద్రనీల్‌బాబు హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున నిన్న వాదనలు వినిపించిన ఆయన.. ఏ తరగతి విద్యార్థులకు ఏ విధమైన అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయాలో N.C.T.E. నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

ఆ నిబంధనల మేరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్‌జీటీ, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు బీఎడ్ అర్హత ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు విద్యాబోధన చేయాల్సి ఉంటుందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎస్‌జీటీలు చెప్పే తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు.. స్కూల్‌ అసిస్టెంట్లు చెప్పే తరగతులకు SGTలతో విద్యా బోధన చేయించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి చర్య ఎన్సీటీఈ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. అనర్హులతో విద్యా బోధన చేయించినట్లు అవుతుందని వాదనలు వినిపించారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.