Internet facility at low cost: ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించా లన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. అనకాపల్లిలోని కేబుల్ ఆపరేటర్‌తో ఆయన సమావేశం అయ్యారు. 199రూపాయలకి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బాక్సులు ఉచితంగా అందిస్తామని తెలిపారు. 249రూపాయలకి 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను తక్కువ ధరలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సంక్రాంతి అనంతరం ఈ కనెక్షన్స్ వేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తక్కువ ధరకి అందిస్తున్న ఇంటర్నెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: