Heavy rain: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరాయి. పలు గ్రామాల వద్ద వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నిరంతా పొలాలకు వచ్చి చేరడంతో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బెలుగుప్ప తండా, గంగవరం గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఉండబండ వంక, బెలుగుప్ప మండలం రామసాగరం వద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. విడపనకల్ మండలం డోనేకల్లు వద్ద పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాటే సమయంలో ఆర్టీసీ బస్సు ఆగిపోయి మధ్యలో చిక్కుకుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థుల సాయంతో బస్సును వాగులోంచి బయటకు తీశారు.
ఇవీ చదవండి: