Dangerous Snake Found in Crop :ప్రపంచంలోే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన గిరినాగు.. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కలకలం రేపింది. రెండ్రోజుల కిందట ఇదే మండలం లక్ష్మీపేటలో 12 అడుగుల గిరినాగును అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తాజాగా మాడుగుల శివారులోని పంటపొలాల వద్ద మరో గిరినాగుపాము రైతుల కంటపడింది. దీన్ని చూసి భయందోళనలకు గురైన స్థానికులు.. వెంటన ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు కొన్ని గంటల పాటు శ్రమించి ఈ భారీ గిరినాగును పట్టుకున్నారు. ఈ పాము పొడవు 15 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే ఇది విషపూరితమైన వాటిలో ఒకటన్నారు. అనంతరం ఈ గిరినాగును వంట్ల మామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: