తెదేపా ఎంపీ సుజనా చౌదరి సంస్థకు సంబంధించిన 315 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. నగదు అక్రమ చలామణీ, బ్యాంకు మోసం ఆరోపణల కేసులో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన స్థిర, చరాస్తుల తాత్కాలిక జప్తునకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్...బీసీఈపీఎల్ దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. ఆ సంస్థ అధికారులు 2010 నుంచి 2013లో వివిధ బ్యాంకులను మోసగించడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. దీనివల్ల ఆయా బ్యాంకులకు రూ.364 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపింది. సుజనా గ్రూపు కంపెనీల్లో భాగమైన బీసీఈపీఎల్.. పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా డబ్బు చలామణీ చేసినట్టు వివరించింది. మహల్ హోటల్స్ అనే డొల్ల కంపెనీకి మళ్లించిన సొమ్ము వైస్రాయ్ హోటల్స్‌కు చేరినట్టు ఈడీ పేర్కొంది. మహల్ హోటల్స్‌కు రూ.315 కోట్ల వరకూ బకాయిలు ఉన్నట్టు వైస్రాయ్ హోటల్స్ అంగీకరించినందున... అంత మొత్తానికీ సరిపడా ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఈడీ వివరించింది
సుజనాకు ఈడీ షాక్... రూ. 315 కోట్ల ఆస్తుల జప్తు - assests
సుజానా చౌదరిపై ఈడీ కొరడా విధించింది. డొల్ల సంస్థలు ఏర్పాటు చేసి, డబ్బు అక్రమంగా చలామణీ చేశారని 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసింది