ETV Bharat / state

44 కుటుంబాలకు 120 ఆవులు అందజేత

Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఆరు నెలల కిందట పిడుగుపాటుకు గురై వందకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. అప్పుడు ముగ్గురు రైతులు కూడా చనిపోయారు. ఆ సమయంలో ఆదుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్​కు వినతులందాయి. ఆయన స్పందించి.. సింహాచలం దేవస్థానం గోసాల నుంచి ప్రత్యేక వ్యాన్ల ద్వారా ఆయా గ్రామాల 44 కుటుంబాలకు 120 పశువులను పంపించారు.. ఇది ఇలా ఉండగా పశువులు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం చేయకపోగా ఇలా గోశాల నుంచి పశువులు పంపిణీ ఏమిటని కొందరు రైతులు గుసగుసలాడుతున్నారు.

Alluri Sitaramaraju District
Alluri Sitaramaraju District
author img

By

Published : Mar 8, 2023, 3:24 PM IST

Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ఇంజరి, లింగేటి, జాముగుడ పంచాయతీల్లో ఆరు నెలల కిందట పిడుగుపాటుకు గురై వందకు పైగా పశువులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా వాటితో పాటుగా.. అప్పుడు ముగ్గురు రైతులు కూడా చనిపోయారు. ఆ సమయంలో వారి కుటుంబాలను ఆదుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్​కు వినతి పత్రాలు అందాయి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారంతో పశువులు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా కొన్ని పశువులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సింహాచలం దేవస్థానం గోశాల నుంచి ప్రత్యేక వ్యాన్ల ద్వారా ఆయా గ్రామాలకు పశువులు తరలించి 44 కుటుంబాలకు 120 పశువులను అందజేశారు.

సింహాచలం నుంచి వారి గ్రామాలకు వెళ్తుండగా మార్గం మధ్యలో పాడేరులో కలెక్టర్, ఎస్పీ వారితో మాట్లాడారు. జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సుచించారు. మైదాన ప్రాంతం వల్ల అవసరమైన పశు దాణా ఇవ్వాలంటూ.. మూడు నెలల వరకు తమను ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పిడుగుపాటు పశువులు రైతులు చనిపోతే ఆ సమయంలో సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్ర రెవెన్యూ శాఖ వచ్చి ఆదుకున్నారు. మనం ఎందుకు చేయలేకపోయామని అని ఈటీవీ ప్రశ్నకు అప్పుడు ప్రతి రైతుకు రూ.25వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశామని.. అయితే తర్వాత పశువులు ఇద్దామని ఆలోచన వలన ఆలస్యమైందన్నారు. గతంలో మావో ప్రభావిత ప్రాంతంలో కలెక్టర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక రహదారి పూర్తయిందని.. మరో రహదారి తయారవుతుందని చెప్పారు. ఇది ఇలా ఉండగా పశువులు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం చేయకపోగా.. ఇలా గోశాల నుంచి పశువులు పంపిణీ ఏమిటని కొందరు రైతులు గుసగుసలాడుతున్నారు.

ఈ రోజు 84 ఆవులు ఇక్కటకు తీసుకురావడం జరిగింది. పశుసంవర్ధక శాఖ, పోలీసుల సహాయంతో గ్రామంలో పంచడం జరుగుతుంది. వచ్చే మూడు నెలలకు వాటికి ఏమి కావాలో వాటన్నింటిని ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఆవులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా 44 కుటుంబాలకు ఆధారం దొరుకుతుంది. ఈ ఘటన జరిగినప్పుడు మా దగ్గరకు ఈ విషయం వచ్చింది.. అప్పుడు మేము ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అనుకున్నాం.. కానీ తరువాత డబ్బులు కాకుండా నేరుగా ఆవులనే ఇస్తే వాళ్లకు జీవన ఆధారం ఉంటుందని ఆనుకున్నాం అందువల్లనే ఆలస్యం అయింది.-సుమిత్ కుమార్, జిల్లా కలెక్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.