Maoists Killed a Man: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం బరకనకోటలో ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు మావోయిస్టుల సమాచారం ఇస్తున్నాడని సోయం సుబ్బారావు అనే వ్యక్తిని ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి.. కర్రలతో కొట్టి హత్య చేశారు. మావోయిస్టు పార్టీ కుంటా కమిటీ.. ఈ మేరకు కరపత్రాన్ని ఘటనా స్థలంలో వదిలారు. గతంలో పోలీసులకు సహకరించొద్దని హెచ్చరించినప్పటికీ లెక్కచేయకపోవడంతో మావోయిస్టులు హత్యకు పాల్పడ్డారు. కాగా రాత్రి నిద్రిస్తున్న సమయంలో 10 మంది వరకూ సాయుదులైన మావోయిస్టులు ఇంటి వద్దకు చేరుకుని.. హతుడి భార్యను ఇంట్లో పెట్టి బయటకు రాకుండా బందించారు. సుబ్బారావును ఇంటికి కొంచం దూరంగా తీసుకెళ్లి హత్య చేశారు.
ఇవీ చదవండి: