The beauty Of Lambasinghi Is Impressive: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రం ఆంధ్రా కశ్మీర్ లంబసింగి, తాజంగి అందాలు ఎంతో ఆకట్టుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అన్నారు. కుటుంబసమేతంగా పర్యటించిన ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రాంత అందాలను తిలకించారు. ముందుగా లంబసింగిలో గిరిజనులు సాగు చేస్తున్న స్ట్రాబెర్రీ తోటలను పరిశీలించారు. తాజంగి జలాశయం వద్ద కుటుంబ సభ్యులతో బోటు షికారు చేశారు. ఈ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పర్యాటకులు ఆస్వాదించే అందాలు చాలా ఉన్నాయని, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చదవండి