Manyam Konda Jathara: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరులో జలపాతం వద్ద నిర్వహించే మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. నెల రోజులు ముందే పొరుగు రాష్ట్రం ఒడిశాలో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరలో కీలక ఘట్టం చివరి రోజు పొల్లూరులో పూర్తి భక్తి భావంతో జరుగుతుంది. ఈ వేడుకకు లక్షలాది గిరిజనులు హాజరవుతారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం కోసం ఇప్పటికే ఆంధ్రా-ఒడిశా అధికారులు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఇటు ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అల్లూరి సీతరామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మన్యం కొండ గ్రామంలో ఉన్న గిరిజన వన దేవుత అయిన కన్నమ రాజు (శ్రీకృష్ణుడు), బాలరాజు (అర్జునుడు), పోతురాజు (బీముడు), ముత్యాలమ్మ తల్లి ఘటాలను ద్వజం రూపంలో పూజలు చేస్తారు. వీటిని ప్రతీ రెండేళ్లకు ఒకసారి ప్రాణ ప్రతిష్ట చేస్తారు.
అయితే ఈ కార్యక్రమాన్నిపొల్లూరు జలపాతం వద్ద నిర్వహించడం ఒడిశా గిరిజనుల ఆచారం ఇందులో భాగంగా ఈ నెల 27 న ప్రధానమైన మంగళ స్నానం, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రూపం లేకుండా ఉన్న ముత్యాలమ్మ తల్లి ఘటం ద్వజ రూపంలో ఉన్న సోదరులు కన్నమ రాజు, బాలరాజు, పోతురాజుతో కలిసి మన్యం కొండ చేరుకుంటారు. సరసపల్లి గ్రామం నుంచి ద్వజాలు కోసం కొత్త వెదుర్లును తీసుకుని పూజారులు వస్తారు. కొండ గుహాల్లో ఉన్న మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి బోయ యాత్రను నిర్వహిస్తారు. భక్తులు చెప్పులు లేకుండా వన దేవతలతో యాత్రను ఒడిశాలోని సీలేరు నది అవతల( పొల్లూరు గ్రామానికి ఎదురు ఒడ్డు)కు ఈరోజు చేరుకుంటారు.
ఈ నెల 27 న సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు ముగించిన తరువాత కొత్తగా తయారు చేసిన ప్రత్యేక పడవలపై వన దేవతలను నది దాటించి ఆంధ్రాలోని పొల్లూరు జలపాతం వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు మంగళ స్నానం చేయించి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. భక్తులు మొక్కులు తీర్చకుంటారు. భారీ అన్నసమారాధన జరుగుతుంది. వన దేవతలకు జలపాతం దగ్గరలో ఉన్న గుహాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలకు సంతృప్తి చెందిన ముత్యాలమ్మ జలపాతంలో బంగారు చేప రూపంలో దర్శనమిస్తుందని నమ్మకం మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు
ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వన దేవతలను, భక్తులకు ప్రత్యేక బోట్లు, గస్తీ నడుమ సీలేరు నది అవతల ఒడ్డుకు చేర్చేందుకు ఒడిశా ఎన్‌డీఆర్ఎఫ్ ఏర్పాట్లు చేపట్టింది. సుమారు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి