All India Adivasi Tribal Conference: విశాఖలో ఈనెల 21న జరిగే అఖిల భారత ఆదివాసి గిరిజన సదస్సు జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘ నేతలు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడారు. ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనులను అణచివేసేందుకు రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలతో గిరిజనులు మనుగడ దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బోయ వాల్మీకులను ఎస్టీలో చేర్చడం, సబ్ ప్లాన్ నిధులు ప్రభుత్వ పథకాలకు వినియోగించడం, జీవో నెంబర్ 3 సుప్రీం రద్దుపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం వంటి చర్యలు వల్ల జగన్ ప్రభుత్వం ఆదివాసి గిరిజనులను అధోగతి చేసిందని ఆరోపించారు. అటవీ, గిరిజన చట్టాలు రాజ్యాంగం 5వ షెడ్యూల్ కులాల కోసం తాము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు.
అటవీ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వాలు నేడు అటవీ హక్కుల చట్టం 2006ను నీరు గారుస్తూ..2022లో అటవీ హక్కుల నియమాలు అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని కారణంగా ఆదివాసీల హక్కులను హరించే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఆదివాసీలకు ఉన్న దారి పోరాటం ఒక్కటే. 1(70) పీసా చట్టాన్ని కూడా ఆదివాసీలకు లేకుండా చేసి.. అటవీ సంపద, ఖనిజ సంపదని కార్పొరేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ప్రతిఘటించాలంటే ఆదివాసీలంతా ఏకమలవ్వాలి. -ఎస్ రామ్మోహన్, ఆదివాసి అఖిలభారత కార్యదర్శి
జగన్మోహన్ రెడ్డి చేసిన పనేంటంటే.. బోయ, వాల్మీకి ఇతర కులాలని అధిక జనాభా ఉండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినవాళ్లని తీసుకొచ్చి ఎస్టీలో కలపడంతో వచ్చిన సమస్య కంటే పెద్ద సమస్య ఇంకోటి లేదు. -రామారావు దొర, రాష్ట్ర ఆదివాసి జేఏసీ నేత
గిరిజన సంఘం ఆందోళన: అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు గిరిజన సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. గిరిజనుల పోలీసులు భారీగా మోహరించి గేటు వద్ద అడ్డుకున్నారు. పోలీసులకు నిరసనకారుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు రావాలంటే నినాదాలు చేశారు జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ పరిస్థితి సమీక్షించారు. పదిమంది వచ్చి సమస్య విన్నవించాలని చెప్పారు. గిరిజన సంఘం నేతలు వినతిపత్రం సమర్పించి పరిష్కరించాలని కోరారు ప్రభుత్వానికి నీవేదిస్తామంటూ జేసీ చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి :